దుబాయ్ లో 6 సెకన్లలో ఇమ్మిగ్రేషన్ క్లియర్..!!

- August 22, 2025 , by Maagulf
దుబాయ్ లో 6 సెకన్లలో ఇమ్మిగ్రేషన్ క్లియర్..!!

యూఏఈ: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇకపై 6 సెకన్లలో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పొందవచ్చు.  కొత్త AI-ఆధారిత స్మార్ట్ కారిడార్‌లో సెకన్లలో ఇమ్మిగ్రేషన్ క్లియర్ అవుతుందని అధికారులు తెలిపారు. పీక్ ట్రావెల్ సీజన్‌లో టెర్మినల్ 3లో కౌంటర్లు, డాక్యుమెంట్ తనిఖీలు లేదా పాస్‌పోర్ట్ స్కాన్‌లు లేకుండా ఇమ్మిగ్రేషన్‌ పూర్తి చేయవచ్చు.

ఏఐ ఆధారిత సెన్సార్లు ప్రయాణీకులు వెళ్లే సమయంలోనే వారి ఫేస్ లను స్కాన్ చేయడంతో ఇది సాధ్యమవుతుందని అధికారులు వివరించారు.  కారిడార్ చివరిలో ప్రయాణీకుడి ఫోటో, విమాన వివరాలు మరియు టైమ్‌స్టాంప్‌తో పాటు "ఇమ్మిగ్రేషన్ విధానం పూర్తయింది" అనే సందేశాన్ని స్క్రీన్ ఫ్లాష్ చేసింది.  ఈ ప్రక్రియ మొత్త పూర్తయేందుకు 6 సెకన్ల టైమ్ మాత్రమే పడుతుందన్నారు.     

ప్రస్తుతం ఈ కారిడార్ ప్రస్తుతం ట్రయల్ దశలో ఉందని,  రాబోయే రోజుల్లో ఎయిర్ పోర్టులోని అన్ని కారిడార్లకు ఈ ఏఐ టెక్నాలజీని విస్తారించే ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. ఈ వ్యవస్థ ఒకేసారి 10 మంది ప్రయాణికులను ప్రాసెస్ చేయగలదని,  సీనియర్ సిటిజన్లు మరియు వీల్‌చైర్‌లను ఉపయోగించే వ్యక్తులకు ఇది చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. 

ఈ కారిడార్ ఇమ్మిగ్రేషన్‌ను వేగవంతం చేయడమే కాకుండా భద్రతను కూడా పెంచుతుందని దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com