సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత..
- August 22, 2025
హైదరాబాద్: సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు.కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 1998, 2004లో లోక్ సభ ఎంపీగా గెలిచారు సుధాకర్ రెడ్డి. 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సురవరం సీపీఐలో అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర కార్యదర్శి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
అనారోగ్య సమస్యలతో సురవరం కొంతకాలం ఆసుపత్రికే పరిమితం అయ్యారు. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.పార్టీలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు సురవరం సుధాకర్ రెడ్డి. తెలంగాణ నుంచి సుదీర్ఘ కాలం పాటు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తన జీవిత కాలం పార్టీ కోసం అంకిత భావంతో పని చేసిన నేతగా గుర్తింపు పొందారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!