కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చానుకు గోల్డ్

- August 25, 2025 , by Maagulf
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చానుకు గోల్డ్

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లలో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణ పతకం గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారు. 48 కేజీల విభాగంలో పోటీపడిన ఆమె అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఈ ఘనత సాధించారు.తన ప్రతిభతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు.

ఈ పోటీలో మీరాబాయి చాను మొత్తం 193 కేజీల బరువును ఎత్తి విజేతగా నిలిచారు.ఇందులో స్నాచ్ విభాగంలో 84 కేజీలు మరియు క్లీన్ & జెర్క్ విభాగంలో 109 కేజీల బరువును అలవోకగా లిఫ్ట్ చేశారు. ఆమె ప్రదర్శన ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. ఈ విజయంతో ఆమె భవిష్యత్తులో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు ఒక బలమైన పోటీదారుగా నిరూపించుకున్నారు.

ఈ విభాగంలో రజత పతకం మలేషియాకు చెందిన ఐరీన్ హెన్రీకి దక్కింది.ఆమె మొత్తం 161 కేజీల బరువును ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచారు.కాంస్య పతకాన్ని వేల్స్ క్రీడాకారిణి నికోల్ రాబర్ట్స్ దక్కించుకున్నారు.ఆమె మొత్తం 150 కేజీల బరువును ఎత్తి మూడవ స్థానంలో నిలిచారు. మీరాబాయి చాను సాధించిన ఈ విజయం భారత క్రీడా రంగానికి ఒక గొప్ప ప్రోత్సాహాన్ని అందించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com