తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- August 27, 2025
తిరుమల: చంద్రుడు ఎరుపు వర్ణంలో కనిపించనున్నాడు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? చంద్రగ్రహణం వల్ల ఏర్పడే ఈ దృశ్యాన్ని బ్లడ్ మూన్ అంటారు. వచ్చేనెల 7-8 రాత్రి సమయంలో బ్లడ్ మూన్ కనపడనుంది.
చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులకు స్వామివారి సేవలకు సంబంధించి అధికారులు కీలక సమాచారం ఇచ్చారు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
సెప్టెంబర్ 7 సాయంత్రం 3.30 గంటల నుంచి సెప్టెంబర్ 8 ఉదయం 3 గంటల వరకు (12గంటల పాటు) శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 7న రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభం కానుంది.
సెప్టెంబర్ 8న వేకువజామున 1.31 గంటలకు వరకు కొనసాగనుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆనవాయితీగా ఆలయం తలుపులు మూసివేయనుంది టీటీడీ.
సెప్టెంబర్ 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవాచనం జరుపుతారు. తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలు ఏకాంతంగా జరుగుతాయి.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







