STEM గ్రాడ్యుయేట్లలో 61% ఎమిరాటీ మహిళలు..!!

- August 27, 2025 , by Maagulf
STEM గ్రాడ్యుయేట్లలో 61% ఎమిరాటీ మహిళలు..!!

యూఏఈ: యూఏఈలో STEM రంగాలలో గ్రాడ్యుయేట్లలో 61 శాతం ఎమిరాటీ మహిళలు ఉంటున్నాని యునెస్కో నివేదిక ఒకటి తేలియజేసింది.  ఇది అరబ్ ప్రపంచ సగటును అధిగమిస్తుందని, ఇది మహిళలను సాధికారపరచడంలో యూఏఈ నిబద్ధతను చాటి చెబుతుందని ఎమిరాటీ టాలెంట్ కాంపిటీటివ్‌నెస్ కౌన్సిల్ (ETCC)లో వ్యూహాత్మక ప్రణాళిక & ఎక్సలెన్స్ డైరెక్టర్ అమల్ అల్ టెనెజీ తెలిపారు. టెక్నాలజీ మరియు AI నుండి ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం వరకు విభిన్న రంగాలలో ఎమిరాటీ మహిళల భాగస్వామ్యం పెరుగుతుందన్నారు.  ముఖ్యంగా పరిశోధన, వైద్యం మరియు ఇతర సంబంధిత రంగాలలో ఎమిరాటీ మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అన్నారు.   

2023-2031కి ఎమిరాటీ మహిళల సాధికారత కోసం అన్ని రంగాలలో మహిళల సమాన భాగస్వామ్యాన్ని అందించడం, వారి జీవన నాణ్యతను పెంచడం లక్ష్యంగా యూఏఈ ప్రణాళిక పెట్టుకుందన్నారు.  ఈ పురోగతిలో యూఏఈ జెండర్ బ్యాలెన్స్ కౌన్సిల్ కీలక పాత్ర పోషిస్తుందని, ఎమిరాటీ మహిళలు దేశ నిర్మాణంలో పాల్గొనడానికి చురుకుగా ప్రోత్సహించబడుతుందని తెలిపారు.

ఎమిరాటీ టాలెంట్ కాంపిటీటివ్‌నెస్ కౌన్సిల్ దాని నఫీస్ కార్యక్రమాల ద్వారా ఎమిరాటీ మహిళలు ప్రాతినిధ్యం, సాధికారత పొందేలా చేస్తుంది. యూఏఈ ఉద్యోగ మార్కెట్‌లో నిర్మాణ రంగంలో 20.7 శాతం, టోకు మరియు రిటైల్ లో 17.3 శాతం మరియు పరిపాలనా సేవా కార్యకలాపాలు 13.1 శాతం మహిళల పనిచేస్తున్నారని ఇటీవలి నఫీస్ డేటా వెల్లడించింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com