సౌదీ ఆర్థిక వృద్ధిని హైలైట్ చేసిన నివేదికపై CEDA సమీక్ష..!!

- August 28, 2025 , by Maagulf
సౌదీ ఆర్థిక వృద్ధిని హైలైట్ చేసిన నివేదికపై CEDA సమీక్ష..!!

జెద్దా: సౌదీ అరేబియా ఆర్థిక,  ప్రణాళిక మంత్రిత్వ శాఖ వేదికను సౌదీ ఆర్థిక మరియు అభివృద్ధి వ్యవహారాల మండలి (CEDA) సమీక్షించింది.  వరుసగా ఐదవ త్రైమాసికంలో సౌదీ అరేబియా ఆర్థిక విస్తరణను హైలైట్ చేశారు.  ముఖ్యంగా చమురుయేతర కార్యకలాపాలలో బలమైన పనితీరును నివేదించారు. 

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన CEDA సమావేశంలో కీలక ఆర్థిక నివేదికలు,  వ్యూహాత్మక చొరవలపై చర్చించారు. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సాధారణ బడ్జెట్ త్రైమాసిక పనితీరు నివేదికపై ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన ప్రజెంటేషన్‌ను సమీక్షించారు. సౌదీ విజన్ 2030కి అనుగుణంగా అభివృద్ధి మరియు సేవా ప్రాజెక్టులకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, ఆదాయ వనరుల వైవిధ్యకరణపై పరిశోధన నివేదికలను సమీక్షించారు. 

సౌదీ ఫండ్ ఫర్ డెవలప్‌మెంట్ మరియు కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (KSrelief) భవిష్యత్ ప్రణాళిక ప్రెజెంటేషన్‌ను సమావేశంలో సమీక్షించారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com