తెలుగు రాష్ట్రాలు: మరో వారం రోజులు వర్షాలు..
- August 29, 2025
ఛత్తీస్ ఘడ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాబోయే వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలోనీ పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయింది.ఈ క్రమంలో ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని ఆరు ప్రధాన పోర్టులలో మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ముఖ్యంగా తీర ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని... మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణలోనూ ఈ అల్పపీడనం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కొన్నిచోట్ల 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







