35 మంది పిల్లలకు స్వాగతం పలికిన ఖతార్ మ్యూజియమ్స్..!!
- August 29, 2025
దోహా: ఖతార్ ఫౌండేషన్ (QF) స్థాపించిన ఖతార్ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ (QCDC) నిర్వహించే ‘లిటిల్ ఎంప్లాయీ’ ఐదవ ఎడిషన్లో భాగంగా ఆగస్టు 27న 35 మంది పిల్లలకు ఖతార్ మ్యూజియమ్స్ (QM) స్వాగతం పలికింది. రోజంతా, పిల్లలు తమ తల్లిదండ్రులు మరియు బంధువులతో కలిసి అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఖతార్ మ్యూజియంల CEO మొహమ్మద్ సాద్ అల్ రుమైహి మాట్లాడుతూ.. యువ తరానికి మ్యూజియమ్స్ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుందన్నారు. ఇక్కడ నిర్వాహకులు, చరిత్రకారులు, డిజైనర్లు, పరిరక్షకులు మరియు సాంకేతిక నిపుణులు భాగస్వామ్య సాంస్కృతిక లక్ష్యాన్ని సాధించడంలో సహకరిస్తారని పేర్కొన్నారు. ఖతార్ నేషనల్ విజన్ 2030లో వివరించిన విధంగా వైవిధ్యభరితమైన జ్ఞాన-ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి ప్రయత్నాలను బలోపేతం చేస్తుందన్నారు.
లిటిల్ ఎంప్లాయీ కుటుంబంలో చేరినందుకు, ప్రారంభ కెరీర్ అభివృద్ధిని ప్రోత్సహించినందుకు ఖతార్ మ్యూజియమ్స్ కు QCDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాద్ అబ్దుల్లా అల్-ఖార్జీ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..