మలేసియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- September 02, 2025
కౌలాలంపూర్: మలేసియా యొక్క 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, మలేసియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు అనేక తెలుగు సంఘాల భాగస్వామ్యంతో "మెర్దేకా మధుర గీతాంజలి చారిటీ" అనే సాంస్కృతిక కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ వేడుకలో దేశభక్తి, సంగీతం, సేవా మనోభావం మిళితమై, మలేసియాలోని తెలుగు ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించిన సంఘాలు:
- మలేసియా తెలుగు ఫౌండేషన్
- మలేసియా-తెలుగు వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్
- తెలుగు ఇంటెలెక్చ్యువల్ సొసైటీ-మలేసియా
మలేసియా పెళ్లిచూపులు అసోసియేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్‌ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేసియా (FNCA) మరియు భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేసియా వంటి ఎన్ఆర్ఐ సంస్థలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు నిచ్చాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత హైకమిషనర్ బి.ఎన్.రెడ్డి హాజరై, తెలుగు సమాజానికి తన ఆశయాలను పంచుకున్నారు.
గౌరవ అతిథులుగా, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ప్రఖ్యాత నటుడు మురళీ మోహన్ , ప్రముఖ సీనియర్ నటుడు ప్రదీప్ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మురళీ మోహన్ సేవల్ని స్మరించుకుంటూ, ఓ స్మరణార్థ వీడియో ప్రదర్శించబడింది, ఇది ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది.
మలేసియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు డాటో కాంతారావు, హైకమిషనర్ బి.ఎన్.రెడ్డి ,మురళీ మోహన్,ప్రదీప్ ని మరియు అన్ని కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు.
ఈ వేడుకలో భాగంగా అనాథ పిల్లలకు కృతజ్ఞతాభివందనాలు మరియు బహుమతులు అందజేయడం ద్వారా చారిటీ లక్ష్యాన్ని కూడా నెరవేర్చారు.
ఈ కార్యక్రమములో తెలుగు గాయకుల వినూత్న సంగీత ప్రదర్శనలు మరింత ఉత్సాహభరితంగా మార్చాయి.దేశభక్తి గీతాలు మరియు సాంస్కృతిక గీతాలతో ప్రేక్షకులను అలరించారు.
FNCA అధ్యక్షుడు బురెడ్డి మోహన్ రెడ్డి, భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా అధ్యక్షుడు చోప్పరి సత్య ఈ వేడుకలో పాల్గొని, సాంస్కృతిక మరియు సామాజిక సేవ అవసరాన్ని ప్రస్తావించారు.
"మెర్దేకా మధుర గీతాంజలి చారిటీ" కార్యక్రమం ఐక్యత, సంప్రదాయం మరియు మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి,మలేసియాలో నివసిస్తున్న తెలుగు సమాజం తమ వారసత్వం పై గౌరవాన్ని, మరియు మలేషియా పై ప్రేమను చాటి చెప్పింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







