జూలై నెలాఖరుకి 100 డేస్ ఆఫ్ లవ్ విడుదల ..

- July 18, 2016 , by Maagulf
జూలై నెలాఖరుకి 100 డేస్ ఆఫ్ లవ్  విడుదల ..

దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ లు కలిసి నటించిన మలయాళ చిత్రం 100 డేస్ ఆఫ్ లవ్. 2015లో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులోను విడుదల చేస్తుండగా, ఇటీవల ఈ చిత్ర ఆడియో వేడుకని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నితిన్, నాని ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ ని విడుదల చేసారు. గతంలో దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ లు కలిసి నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ ను సాధించగా ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తున్న 100 డేస్ ఆఫ్ లవ్ సినిమా వీటన్నింటినీ మరిపించేది గా తెరకెక్కించారు దర్శక నిర్మాతలు . జీనస్ ముహ్మద్ దర్శకత్వంలో, SSC మూవీస్ సమర్పణలో , ఎస్. వెంకటరత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం మలయాళం లో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. జూలై నెలాఖరుకి 100 డేస్ ఆఫ్ లవ్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com