సెమికాన్ ఇండియా-2025 ను ప్రారంభించిన ప్రధాని మోదీ

- September 02, 2025 , by Maagulf
సెమికాన్ ఇండియా-2025 ను ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: భారతదేశ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను ఉత్ప్రేరకపరిచే లక్ష్యంతో ప్రధాని మోదీ న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా-2025’ను ప్రారంభించారు. ఆనంతరం మోదీ సీఈవోల రౌంట్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. మూడురోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తారు. సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్పు రోగతి, సెమీకండక్టర్ ఫ్యాబ్, ఆధునాతన ప్యాకేజింగ్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాలయ సంసిద్ధత, స్మార్ట్ తయారీ, ఆర్ అండ్ డి, కృత్రిమ మేధస్సు, పెట్టుబడి అవకాశాలు వంటివాటన్నింటిపై సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాక డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (డిఎల్) పథకం కింద చొరవలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ వృద్ధి, అంతర్జాతీయ సమకారం, భారతదేశ సెమీకండక్టర్ రంగం కోసం భవిష్యత్తు రోడ్ మ్యాపు హైలైట్ చేయనున్నది.

ఈ కార్యక్రమానికి దాదాపు 48దేశాల నుంచి 2,500మందికి పైగా ప్రతినిధులు, 50మందికి పైగా ప్రపంచ నాయకులు, 350మందికి పైగా ప్రదర్శనకారులు సహా, 20,750 మందికిపైగా హాజరు అయ్యారు. ఇందులో 6దేశాల రౌండేబుల్ చర్చలు, కంట్రీ పెవిలియన్లు,(Country pavilions,) వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్టార్ట్-అప్ కోసం అంకితమైన పెవిలియన్లు కూడా ఉంటాయి. విశ్వ వ్యాప్తంగా నిర్వహించబడే సెమికాన్ సమావేశాలు, సెమీకండక్టర్ డొమైన్లో సాంకేతిక పురోగతిని, వారి సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి వివిధ దేశాల విధానాలను గరిష్టంగా చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

దేశీయంగా సెమీకండక్టర్ల డిజైన్, ఫ్యాబ్రికేషన్ మరియు ప్యాకేజింగ్ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడం, అలాగే భారతదేశాన్ని ప్రపంచ సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా మార్చడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు.

సెమీకండక్టర్లు (చిప్స్) ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలైన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, కార్లు మరియు ఇతర గృహోపకరణాలలో కీలకమైన భాగాలు. ప్రపంచ సాంకేతిక రంగంలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com