టీమ్ఇండియా స్పాన్సర్ షిప్ కోసం బిడ్లను ఆహ్వానించిన బీసీసీఐ..
- September 02, 2025
ముంబై: టీమ్ఇండియా స్పాన్సర్ షిప్ నుంచి డ్రీమ్ 11 తప్పుకున్న సంగతి తెలిసిందే.ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 ఇటీవల పార్లమెంట్లో ఆమోదం పొందడంతో డ్రీమ్ 11 ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బీసీసీఐ (BCCI) కొత్త స్పాన్సర్ కోసం వెతుకులాట ప్రారంభించింది.అందులో భాగంగా మంగళవారం భారత స్పాన్సర్ షిప్ కోసం బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది.
కాగా..ఇందు కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించొద్దని తెలిపింది.
స్పాన్సర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలకు మార్గదర్శకాలు ఇవే..
- ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గాంబ్లింగ్‌తో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం కలిగి ఉండకూడదు.
- భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడూ కూడా ఇలాంటి సేవలు అందించకూడదు.
- బెట్టింగ్, బిడ్డింగ్ సంస్థల్లోనూ ఆయా కంపెనీలకు పెట్టుబడులు కూడా ఉండకూడదు.
- గేమింగే కాకుండా.. క్రిప్టో ట్రేడింగ్, క్రిప్టో ఎక్ఛేంజ్, క్రిప్టో టోకెన్స్‌కు సంబంధించిన వ్యాపార కార్యకలాపాల్లో భాగస్వామ్యం ఉండకూడదు.
అంతేకాదండోయ్..బిడ్డింగ్‌లో నిషేధిత బ్రాండ్లకు సంబంధించిన కంపెనీలు పాల్గొనకుండా నిషేదం విధించింది.
ఇక బిడ్డింగ్‌లో పాల్గొనాలనుకునే కంపెనీల వార్షిక టర్నోవర్ కనిష్టంగా రూ.300 కోట్లు అయినా ఉండాలని నిబంధనను విధించింది. ఇక కంపెనీలు దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 16గా నిర్ణయించింది. ఎటువంటి కారణం ఇవ్వకుండా ఏ విధంగానైనా ఏ దశలోనైనా బిడ్డింగ్ ప్రక్రియను రద్దు చేసే లేదా సవరించే హక్కు బోర్డుకు ఉంటుందని తెలిపింది.
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్..
సెప్టెంబర్ 9 నుంచి ఆసియాకప్ 2025 ప్రారంభం కానుంది. టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌ను ఆతిథ్య యూఏఈతో సెప్టెంబర్ 9న ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో భారత్ సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఆడనుంది.
తాజా వార్తలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!







