తగ్గిన రూపాయి.. UAE, GCC నుండి ఇండియాకు పెరిగిన రెమిటెన్స్..!!
- September 03, 2025
యూఏఈ: డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి రికార్డు స్థాయిలో పడిపోయిది. దాంతో గల్ఫ్‌లోని ప్రవాసుల నుండి ఇండియాకు రెమిటెన్స్ భారీగా పెరిగాయి. భారతీయ వస్తువులపై ఇప్పటికే యూఎస్ 50 శాతం టారిఫ్ లతో రూపాయి విలువ డాలర్‌తో 88.30కి చేరుకుంది. ఇది ఇప్పటివరకు అత్యంత కనిష్ట స్థాయి.
మరోవైపు భారత ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు అంచనా వేసిన 6.7 శాతాన్ని అధిగమించింది. అయితే, టారిఫ్ ల ప్రభావంతో రెండవ త్రైమాసిక వృద్ధి మందగించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
ఇక రూపాయి విలువ తగ్గడంతో తొమ్మిది మిలియన్లకు పైగా భారతీయులకు నిలయమైన గల్ఫ్‌లో ఉంటున్న ప్రవాసులు లాభాలను పొందుతున్నారు. ఇటీవలి రోజుల్లో భారతదేశానికి పంపే నగదులో 15 శాతం పెరుగుదల నమోదు అయిందని అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అలీ అల్ నజ్జర్ అన్నారు. ముఖ్యంగా ఓనం పండుగ సీజన్ లావాదేవీలలో బలమైన పెరుగుదల కనిపించిందన్నారు. రూపాయి ఇప్పుడు దిర్హామ్‌కు 24.03 దగ్గర ట్రేడవుతోందని, చాలా మంది ప్రవాసులకు ప్రయోజనాలను కలిగిస్తుందన్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







