విదేశాలలో చిక్కుకున్న 30 మంది బహ్రెయిన్ సిటిజన్స్ రెస్క్యూ..!!

- September 03, 2025 , by Maagulf
విదేశాలలో చిక్కుకున్న 30 మంది బహ్రెయిన్ సిటిజన్స్ రెస్క్యూ..!!

మనామా: విదేశంలో ఊహించని సంఘటన తర్వాత 30 మంది బహ్రెయిన్ పౌరులు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా తిరిగి తీసుకొచ్చినట్లు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్థానికంగా ఉండే ట్రావెల్ ఏజెన్సీ ఒక హోటల్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిర్వహించడంలో వైఫల్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని మంత్రిత్వ శాఖలోని కాన్సులర్ సర్వీసెస్ సెక్టార్ హెడ్ రాయబారి ఇబ్రహీం మొహమ్మద్ అల్-ముసల్మాని తెలిపారు. సమాచారం అందగానే బహ్రెయిన్ రాయబార కార్యాలయం వెంటనే రంగంలోకి దిగి, వివరాలు సేకరించిందన్నారు.

బహ్రెయిన్‌కు తిరిగి వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అనంరతం ఫిర్యాదు సదరు ట్రావెల్ ఏజెన్సీని సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం దానిపై విచారణ జరుగుతుందన్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు లైసెన్స్ పొందిన మరియు గుర్తింపు పొందిన కంపెనీలతో మాత్రమే ప్రయాణించాలని కోరారు.

బహ్రెయిన్ పౌరుల భద్రతకు బహ్రెయి ప్రాధాన్యత ఇస్తుందని రాయబారి అల్-ముసల్మాని హైలైట్ చేశారు. మంత్రిత్వ శాఖ యొక్క 24/7 కాల్ అండ్ ఫాలో-అప్ సెంటర్ ఏవైనా అత్యవసర కేసులను నిర్వహించడానికి అందుబాటులో ఉంటుందని, 17227555 కు డయల్ చేయడం ద్వారా తమను సంప్రదించాలనికోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com