దేశాభివృద్ధికి బూస్టర్ డోస్, ప్రజలకు దీపావళి గిఫ్ట్‌..!

- September 04, 2025 , by Maagulf
దేశాభివృద్ధికి బూస్టర్ డోస్, ప్రజలకు దీపావళి గిఫ్ట్‌..!

న్యూ ఢిల్లీ:  జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ గా అభివర్ణించారు. దీపావళికి ముందే ప్రజలకు ఆనందం వచ్చిందన్నారాయన. ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే మా ప్రభుత్వ విధానం అని ఆయన స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణలతో పౌరుల జీవన నాణ్యత మెరుగుపడుతుందన్నారు. వినియోగం, వృద్ధికి కొత్త బూస్టర్ డోస్ లభిస్తుందని ఆకాంక్షించారు. కొత్త సంస్కరణలతో ఆత్మనిర్భర్ భారత్ మరింత ముందే సాకారం అవుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

‘మేడిన్ ఇండియాపై అందరూ ఆలోచించాలి. గాంధీజీ ఇచ్చిన స్వదేశీ నినాదం అందరం పాటిద్దాం. స్వదేశీ విధానంతోనే మరింత స్వావలంబన సాధించగలం. హెయిర్ పిన్నులు కూడా విదేశాల నుంచి తెచ్చుకునే విధానం మారాలి. స్వదేశీ వస్తు వినియోగం, మేడిన్ ఇండియాను విద్యార్థి దశ నుంచే అలవాటు చేయాలి. మన దేశంలో తయారు చేసిన వస్తువులనే వాడాలి.

దేశీయ ఉత్పత్తులు వాడేందుకు గర్వపడాలి. మేడిన్ ఇండియాపై చిన్న, పెద్ద అందరూ ఆలోచించాలి. దేశీయ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారిపోతాయి. స్వదేశీ డే స్వదేశీ వీక్ ను పండుగగా నిర్వహించుకోవాలి.దేశీయ ఉత్పత్తిదారులను మనమే గౌరవించాలి, ఆదరించాలి. దేశభక్తి, ఆత్మగౌరవం, స్వయం సమృద్ధితో దేశాన్ని ముందుకు నడిపిద్దాం” అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com