ఒమన్ విద్యా ప్రణాళికకు UNICEF ఆమోదం..!!

- September 05, 2025 , by Maagulf
ఒమన్ విద్యా ప్రణాళికకు UNICEF ఆమోదం..!!

మస్కట్: న్యూయార్క్‌లో జరిగిన UNICEF కార్యనిర్వాహక బోర్డు రెండవ రెగ్యులర్ సెషన్‌లో ఒమన్ కొత్త 2026-2030 కంట్రీ ప్రోగ్రామ్ డాక్యుమెంట్ (CPD) కు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం లభించింది. దీనిని ప్రభుత్వ సంస్థలు, పౌర సమాజం మరియు ఇతర భాగస్వాముల భాగస్వామ్యంతో రూపొందించారు. ఇది పిల్లల జీవితకాలంలో వచ్చే కీలక దశలపై దృష్టి పెడుతుంది. "ప్రారంభ బాల్యం" లో  నాణ్యమైన విద్యాభ్యాసంపై.. "కౌమార దశలో" విద్య, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుంది.  

UNICEF సెషన్ లో సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ లైలా అహ్మద్ అల్ నజ్జర్ వర్చువల్‌గా పాల్గొన్నారు.  జాతీయంగా పిల్లల హక్కులను ముందుకు తీసుకెళ్లడంలో ఒమన్ నిబద్ధతను హైలైట్ చేశారు. తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు మద్దతు ఇవ్వడం, డిజిటల్ ప్రపంచంలో.. సాయుధ సంఘర్షణలో పిల్లలను రక్షించడానికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. 

"యునిసెఫ్,  ఒమన్ మధ్య భాగస్వామ్యం దేశ భవిష్యత్తులో పిల్లల అభివృద్ధికి దోహదం చేస్తుందని  ఒమన్ సుల్తానేట్‌లోని యునిసెఫ్ ప్రతినిధి సుమైరా చౌదరి అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com