ఫుట్‌బాల్ అభిమానులకు ఖతార్ గుడ్ న్యూస్ ..!!

- September 05, 2025 , by Maagulf
ఫుట్‌బాల్ అభిమానులకు ఖతార్ గుడ్ న్యూస్ ..!!

దోహా: ఫుట్‌బాల్ అభిమానులకు ఖతార్ గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 7న జరిగే ఖతార్-రష్యా ఫ్రెండ్లీ మ్యాచ్‌కు ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నట్లు ఖతార్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (QFA) ప్రకటించింది. ఈ మ్యాచ్ సాయంత్రం 6:15 గంటలకు జాస్సిమ్ బిన్ హమద్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

అక్టోబర్‌లో జరిగే కీలకమైన FIFA ప్రపంచ కప్ 2026 ఆసియా ప్లే-ఆఫ్‌ల కోసం సన్నాహాల్లో భాగంగా రష్యాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు ఖతార్ ప్రకటించింది. ప్రపంచ కప్ ప్లే-ఆఫ్‌ల కోసం ఖతార్ గ్రూప్ Aలో ఉంది. అక్టోబర్ 8న ఒమన్‌తో, అక్టోబర్ 14న దోహాలోని జాసిమ్ బిన్ హమద్ స్టేడియంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో ఆడనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com