EU ప్రతినిధులతో ఖతార్ పీఎం భేటీ..!!
- September 06, 2025
దోహా: ఈయూ ప్రతినిధులతో ఖతార్ పీఎం భేటీ అయ్యారు. ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్-థాని.. యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు HE కాజా కల్లాస్తో సమావేశమయ్యారు. ఆయన ప్రస్తుతం ఈయూ దేశాల్లో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఖతార్, యూరోపియన్ యూనియన్ మధ్య సహకారాన్ని మరింత పెంచే మార్గాలపై సమీక్షించారు. అలాగే పలు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా గాజా స్ట్రిప్, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని పరిణామాలను సమీక్షించారు.
గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ సాధించడానికి, పౌరుల రక్షణను నిర్ధారించడానికి కృషి చేయాలని నిర్ణయించారు. బాధితులకు మానవతా సహాయం అందించడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఖతార్ పీఎం పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







