బహ్రెయిన్‌లో యువ ప్రతిభకు పట్టం..!!

- September 08, 2025 , by Maagulf
బహ్రెయిన్‌లో యువ ప్రతిభకు పట్టం..!!

మనామా: బహ్రెయిన్ లో యూత్ ఇన్నోవేషన్ మరియు ఎక్సలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు  వర్క్స్ మంత్రిత్వ శాఖను యువజన వ్యవహారాల ప్రతినిధి షేక్ నాజర్ బిన్ హమద్ అల్ ఖలీఫా  ప్రశంసించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో యువతను ప్రోత్సహించడానికి హిస్ హైనెస్ జారీ చేసిన వ్యూహాత్మక ప్రణాళికకు అనుగుణంగా ఈ కమిటీ ఏర్పాటు ఒక కీలక ముందడుగా ఆయన అభివర్ణించారు.

యువ ప్రతిభను ఉపయోగించుకోవడానికి, వారికి పని వాతావరణాన్ని మెరుగుపరచడంలో మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలను హిస్ హైనెస్ ప్రశంసించారు. యువ నిపుణులను సాధికారత కల్పించే జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా  ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు,  ప్రాజెక్టుల ద్వారా యువతలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడానికి కమిటీ కృషి చేయాలని పిలుపునిచ్చారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com