ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- January 18, 2026
దోహా: ఖతార్ లో విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ప్రారంభించిన “ప్రైవేట్ స్కూల్స్ మరియు కిండర్ గార్టెన్ల కమ్యూనిటీ బాధ్యత” ప్రాజెక్ట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చొరవ కింద 46 ప్రైవేట్ స్కూల్స్, కిండర్ గార్డెన్స్ ముందుకొచ్చాయి. దాదాపు 4వేల మందికిపైగా విద్యార్థులకు ఫ్రీ మరియు రాయితీ సీట్లను అందించనున్నట్లు ప్రకటించాయి.
విద్య మరియు ఉన్నత విద్యా మంత్రి హెచ్ ఇ లోల్వా బింట్ రషీద్ బిన్ మొహమ్మద్ అల్ ఖాటర్.. ఈ ప్రాజెక్టుకు సహకారం అందించిన ప్రైవేట్ స్కూల్స్ ప్రతినిధులను సత్కరించారు. విద్యా మంత్రిత్వ శాఖ ప్రకారం, పదేళ్లలో ఉచిత సీట్ల అంచనా విలువ QR18.6 బిలియన్ (QR18,638,023,000) కంటే ఎక్కువగా ఉంటుందని, ఇది మెరగైన విద్యా వ్యవస్థకు ప్రైవేట్ స్కూళ్ల మద్దతును హైలైట్ చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హెచ్ ఇ డాక్టర్ ఇబ్రహీం బిన్ సలేహ్ అల్ నుయిమి, అసిస్టెంట్ అండర్ సెక్రటరీలు, లైసెన్స్ హోల్డర్లు మరియు ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్ల డైరెక్టర్లతో పాటు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు







