బోనాలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు..
- July 19, 2016
బోనాల కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు రూ.7కోట్లు వ్యయం చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణపై సమీక్షలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు సీపీ మహేందర్‌రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. బోనాల సందర్భంగా అదనంగా 500మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తారని, ఆరు మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆగస్టు 1 నుంచి ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.
బోనాలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇతర శాఖలతో పోలీసుశాఖ సమన్వయంతో పనిచేస్తుందన్నారు.బోనాల వూరేగింపు మార్గాల్లో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల రక్షణకు షీ బృందాలు, గొలుసు దొంగతనాల వ్యతిరేక బృందాలను నియమిస్తామన్నారు. బోనాల కోసం 3వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను ప్రజలు నమ్మొద్దని.. ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అన్ని వర్గాలు పోలీసులకు సహకరించి బోనాలు శాంతియుతంగా జరిగేలా చూడాలని కమిషనర్ కోరారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







