యూఏఈలో డ్రైవర్‌లెస్ కార్ల డెలివరీలు..!!

- September 09, 2025 , by Maagulf
యూఏఈలో డ్రైవర్‌లెస్ కార్ల డెలివరీలు..!!

యూఏఈ: అత్యాధునిక డ్రైవర్‌లెస్ టెక్నాలజీకి యూఏఈ కేంద్రంగా మారుతోంది. ప్రయాణికులను ట్రాన్స్ పోర్ట్ చేసేముందు ఆటోమెటిక్ టాక్సీల నుండి డ్రైవర్లు లేకుండా కస్టమర్‌లకు వస్తువులను తీసుకువచ్చే డెలివరీ వాహనాల వరకు ఉన్నాయి.

దుబాయ్ వాణిజ్యం, రవాణా మరియు లాజిస్టిక్స్ హోల్డింగ్ గ్రూప్ 7X ఈమేకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక సంవత్సరంలో యూఏఈ అంతటా స్వంతంగా వాహనాల ద్వారా డెలివరీలను ప్రారంభించాలని యోచిస్తోస్తున్నట్టు దని దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. కంపెనీ ప్రస్తుతం అబుదాబిలోని మస్దార్ నగరంలో ఆటోమెటిక్  వాహనాల ట్రయల్స్ నిర్వహిస్తోంది. వినియోగదారులకు ఉత్పత్తులను పంపిణీ చేస్తోంది.

“మస్దార్ నగరంలో ఇప్పటికే కొన్ని ఆటోమెటెడ్ ట్రక్కులు డెలివరీలు చేస్తున్నాయి. త్వరలోనే దీనిని ఖలీఫా సిటీకి విస్తరిస్తాము. ఆ తర్వాత దుబాయ్‌లో కూడా మరో ట్రయల్ నిర్వహిస్తాం. ఒక సంవత్సరంలో తాము ఆ వాహనాలను యూఏఈ అంతటా రోడ్లపై పెడతాము ”అని 7X గ్రూప్ CEO తారిక్ అల్ వహేది అన్నారు.

 ఏప్రిల్‌లో యాంగో టెక్నాలజీ ఫుడ్,  టెక్ సంస్థ రూట్స్ అండ్ రోడ్స్ మరియు ట్రాన్స్‌పోర్ట్ అథారిటీతో భాగస్వామ్యంతో శోభా హార్ట్‌ల్యాండ్‌లో 30 నిమిషాల లోపు 22 కిలోమీటర్ల పరిధిలో ఆర్డర్‌లను డెలివరీ చేయనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com