వలసదారుడి మృతి: తప్పు మాది కాదు

- July 19, 2016 , by Maagulf
వలసదారుడి మృతి: తప్పు మాది కాదు

భారతీయ వలసదారుడు దివాకరన్‌ ఆచారి, ప్రాణాలు కోల్పోవడం వెనుక అతన్ని హైర్‌ చేసుకున్న కంపెనీ నిర్లక్ష్యం ఉందంటూ వస్తున్న ఆరోపణల్ని ఆ సంస్థ ఖండించింది. స్ట్రోక్‌ కారణంగా 58 ఏళ్ళ దివాకరన్‌ మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న దివాకరన్‌ స్వదేశానికి వెళ్ళేందుకు ప్రయత్నించగా దానికి ఆ సంస్థ అనుమతించలేదనీ, ఆ ఒత్తిడితోనే అతను స్ట్రోక్‌కి గురయ్యాడని ఆరోపించారు. అయితే సంస్థ అధికారులు మాత్రం, దివాకరన్‌ లీవ్‌ అప్లికేషన్లు ఎప్పుడూ రిజెక్ట్‌ చేయలేదని స్పష్టం చేశారు. పనిచేస్తున్న సంస్థపై దివాకరన్‌ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని ఎంబసీ వర్గాలు స్పష్టం చేశాయి. స్వదేశానికి వెళ్ళేందుకు ఆర్థిక సమస్యలు దివాకరన్‌ని వెంటాడాయనీ, ఆ సమస్య కారణంగానే తనంతట తానుగా స్వదేశానికి వెళ్ళలేకపోయాడని కంపెనీ ప్రతినిథులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com