సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- September 11, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని 51 నగరాలు మరియు గవర్నరేట్‌లలో 2,000 కంటే ఎక్కువ ఫీల్డ్ తనిఖీలను నిర్వహించినట్లు సౌదీ అథారిటీ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వెల్లడించింది. ఈ సందర్భంగా ట్రేడ్‌మార్క్ చట్టాన్ని ఉల్లంఘించిన 3.6 మిలియన్లకు పైగా ఉత్పత్తులను సీజ్ చేసిన్నట్టు తెలిపింది. అథారిటీ జారీ చేసిన 2024 వార్షిక మేధో సంపత్తి హక్కుల అమలు నివేదిక ప్రకారం, ఈ ఉల్లంఘనలలో దాదాపు 52 శాతం డ్రెసెస్, ఫుట్ వేర్ రంగంలో ఉన్నాయి.
వీటితోపాటు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ సహకారంతో 330 అనుమానిత కస్టమ్స్ షిప్‌మెంట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. దాంతో 6.7 మిలియన్లకు పైగా ఫేక్ ఉత్పత్తులు స్థానిక మార్కెట్‌లోకి ప్రవేశించకుండా నిరోధించినట్లు వెల్లడించారు.
అద విధంగా డిజిటల్ రంగంలో 2024లో 7,900 వెబ్‌సైట్‌లు బ్లాక్ చేసినట్టు తెలిపింది. కాపీరైట్ రక్షణ చట్టాన్ని ఉల్లంఘించిన లైవ్ స్ట్రీమింగ్ సైట్‌లకు సంబంధించి 2023తో పోలిస్తే 128 శాతం పెరుగుదల నమోదు అయినట్లు పేర్కొంది. కాపీరైట్ మరియు ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు సంబంధించిన 3,200 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో