సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!

- September 11, 2025 , by Maagulf
సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాతో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ షేక్ హోముద్ ముబారక్ అల్-హోముద్ అల్-జాబర్ అల్-సబా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పౌర విమానయాన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.

వీటితోపాటు, ఆసక్తి ఉన్న రంగాలపై చర్చలు జరిపినట్లు ఒక ప్రకటనలో షేక్ హోముద్ అల్-సబా తెలిపారు. ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం టెక్నాలజీ  సంబంధిత రంగాల్లో సహకారాన్ని విస్తరించే అవకాశాలపై సమీక్షించినట్లు పేర్కొన్నారు.  పౌర విమానయానంలో కువైట్‌తో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని డాక్టర్ ఆదర్శ్ స్వైకా తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com