అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!

- September 11, 2025 , by Maagulf
అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!

దోహా: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఇజ్రాయెల్ దాడి పట్ల సంఘీభావాన్ని తెలిపారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఇది అన్ని అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేఅని పేర్కొన్నారు. 

ఖతార్ ప్రజల భద్రతకు ముప్పు కలిగించే మరియు ఈ ప్రాంత భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీసే ఏ దురాక్రమణనైనా భారత్ తిరస్కరిస్తుందని స్పష్టం చేశారు.  తమకు మద్దతుగా నిలిచిన భారత్ కు అమీర్ కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com