రష్యాలో భారీ భూకంపం
- September 13, 2025
రష్యా: రష్యా తూర్పుతీరంలోని కమ్చత్కా ద్వీపకల్పంలో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే (USS) ప్రకటించింది.ఈ శక్తివంతమైన భూకంపంతో అధికారులు సమీప తీరప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసారు. ప్రజలు ఇండ్లలో నుంచి పరుగులుతీస్తూ బయటకు వచ్చారు. భూకంపం సంభవించిన వెంటనే పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం అప్రమత్తమైంది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని రష్యా తీర ప్రాంతాలపై ప్రమాదకరమైన అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించింది.
గత జులై నెలలో ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించిన విషయం విధితమే. ఆసమయంలో పసిఫిక్ అంతటా సునామీ అలలు ఎగసిపడటంతో హవాయి నుంచి జపాన్ తో సహా పలు దేశాలు తీరప్రాంతప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలించాయి.కాగా శనివారం ఉదయం భూకంపం రావడంతో ప్రజలు భయకంపితులై ఇండ్లలో నుంచి బయటికి వచ్చారు.
గతంలో మయన్మార్, థాయ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్లలో భారీ భూకంపాలు సంభవించాయి.ఇటీవల ఈ భూకంపాలు పెరిగిపోవడంతో ఎప్పుడేమి జరుగుతుందో తెలియని భయంతో ప్రజలు మనుగడను సాగిస్తున్నారు.భారీ భవంతులు, అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం తరచూ భూమి లోతుల్లోకి తవ్వకాలు చేస్తుండడం భూమి ఉపరితలంలూజుగా మారి తరచూ భూకంపాలకు కారణమని భూగర్భ నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం