పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- September 13, 2025
మనామా: బహ్రెయిన్ లో ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సరైన నంబర్ ప్లేట్లు, వ్యాలిడ్ లైసెన్స్లు లేకుండా, రోడ్లపై ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తున్న పలువురిని ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారితోపాటు వారి బైకులను సీజ్ చేశారు.
చట్టవిరుద్ధమైన ప్రవర్తనను ఎలాంటి పరిస్థితుల్లో సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. రోడ్లపై ప్రమాదకరమైన విన్యాసాలు, ట్రాఫిక్ చట్టాలను విస్మరించడం వంటి ఉల్లంఘనలు అధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. బహ్రెయిన్ ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా పట్టుబడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజా భద్రతను కాపాడేందుకు అందరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని ఒక ప్రకటనలో ట్రాఫిక్ డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..