ఒమన్ లో అడ్వాన్స్‌డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్‌ ప్రారంభం..!!

- September 15, 2025 , by Maagulf
ఒమన్ లో అడ్వాన్స్‌డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్‌ ప్రారంభం..!!

మస్కట్: ఒమన్ లో అడ్వాన్స్‌ డ్ ఎయిర్ మొబిలిటీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఈ మేరకు ఒమన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు  ఒడిస్ ఏవియేషన్‌తో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశాయి.

ఈ కార్యక్రమం అధునాతన ఎయిర్ మొబిలిటీ పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించడానికి సమగ్ర నమూనాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ఒడిస్ అభివృద్ధి చేసిన “లైలా” విమానం కూడా ఉందని, ఇది ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఉపయోగించి హారిజంటల్ గా టేకాఫ్ మరియు ల్యాండింగ్ కోసం రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమం పైలట్ దశ 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభం కానుందన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా ఒడిస్ ఏవియేషన్, ప్రముఖ ప్రపంచ అధునాతన ఎయిర్ మొబిలిటీ కంపెనీలు, ఎంపిక చేసిన వ్యూహాత్మక భాగస్వాములను ఒకచోట చేర్చుతుందని పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com