బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!

- September 14, 2025 , by Maagulf
బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!

మనామా: బహ్రెయిన్ లో డేంజరస్ యానిమల్స్ పై యాజమాన్యం మరియు వాణిజ్యాన్ని నియంత్రించే లక్ష్యంతో చట్టం చేయనున్నారు. ఈ మేరకు రాబోయే శాసనసభ సమావేశంలో ప్రతినిధుల మండలిలో ఓటింగ్ నిర్వహించనున్నారు. బహ్రెయిన్ లో ఈ తరహా చట్టాన్ని రూపొందించడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. 

ఈ చట్టం అమల్లోకి వస్తే, కమ్యూనిటీ భద్రత మెరుగవ్వడంతోపాటు ఆయా యానిమల్స్ కు కూడా సరైన షెల్టర్ లభిస్తుందన్నారు. ఇకపై డేంజరస్ యానిమల్స్ ను ఇండ్లలో పెంచుకునేందుకు కఠిన నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.

ముసాయిదా చట్టం ప్రకారం, జంతు ప్రదర్శనశాలలు, వన్యప్రాణుల పార్కులు, సర్కస్‌లు, పరిశోధన మరియు శాస్త్రీయ సంస్థలు, అలాగే ప్రభుత్వం, భద్రతా మరియు సైనిక సంస్థలకు మాత్రమే డేంజరస్ యానిమల్స్ ను పెట్టుకోవడానికి అనుమతి ఉంటుంది. ఇక నిబంధనలను ఉల్లంఘించిన వారికి జైలు శిక్షతోపాటు BD 1,000 మరియు BD 10,000 మధ్య జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

వేటాడే జంతువులను బహిరంగ ప్రదేశాల్లోకి తీసుకురావడం, వాటి వల్ల ప్రజలకు నష్టం కలిగించడం లాంటి సంఘటనలను సీరియస్ గా తీసుకుంటారు. అలాంటి నేరాలకు పాల్పడిన వారికి జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com