ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- September 15, 2025
మనామా: మనీ లాండరింగ్, ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని బహ్రెయిన్ ఆవిష్కరించింది. గన్ కల్చర్ విస్తరణను ఎదుర్కోవడానికి ఈ జాతీయ వ్యూహం తొడ్పతుందని అంతర్గత మంత్రిత్వశాఖ మంత్రి జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా అన్నారు. ఈ వేడుక పబ్లిక్ సెక్యూరిటీ ఆఫీసర్స్ క్లబ్లో జరిగింది.
బహ్రెయిన్ జాతీయ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో ఈ వ్యూహం కీలకమని, ఉగ్రవాదం, దాని ఫైనాన్సింగ్ మరియు మనీ లాండరింగ్‌ను ఎదుర్కోవడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా యాంటీ-మనీ లాండరింగ్ మరియు ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం కమిటీ సీఈఓ, చైర్పర్సన్ షైఖా మే బింట్ మొహమ్మద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ నేషనల్ సెంటర్ పనితీరును ప్రశంసించారు.
మనీలాండరింగ్ వ్యతిరేక మరియు ఉగ్రవాద నిరోధక ఫైనాన్సింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయడంతోపాటు ఆర్థిక వ్యవస్థ సమగ్రతను పెంచడానికి ప్రత్యేక వ్యూహం ఉపయోగపడుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!