శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- September 18, 2025
తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వచ్చే నెల సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు ఘనంగా జరగనున్నారు. ఈ విశిష్ట ఉత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్, ప్రభుత్వ యంత్రాంగం భక్తుల సౌకర్యం, భద్రత కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మీడియా సమావేశంలో వివరించినట్టు, భక్తుల పెద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ప్రధాన అంశమని పేర్కొన్నారు.
పాత అనుభవాల నుండి పొందిన పాఠాలను పరిగణలోకి తీసుకొని, ఈ సంవత్సరం భద్రతా ఏర్పాట్లలో మరింత పకడ్బందీతో పని జరుగుతోంది. ఉత్సవాల సందర్భంగా తిరుమల కొండ మరియు తిరుపతి నగరంలో భక్తుల పరిరక్షణకు ప్రత్యేకంగా కేంద్రీకృతమైన భద్రతా దళాలను మోహరించడం జరిగింది. మొత్తం 4,000 మంది పోలీస్ సిబ్బందిని ఉత్సవాల కోసం మోహరించడం జరుగుతున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో 3,000 మంది తిరుమల కొండ పై విధుల్లో ఉండగా, మిగిలిన 1,000 మంది తిరుపతి నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..