భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..

- September 19, 2025 , by Maagulf
భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..

హైదరాబాద్: తరచూ భారీ వర్షంతో హైదరాబాద్ వణికిపోతున్నది. గత ఆదివారం నుంచి సాయంత్రం వేళలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి.ఒక వైపు ఉదయం ఎండ కాస్తే, నాలుగు గంటలు అయితే చాలు భారీవర్షాలతో హైదరాబాద్ ను వరదలతో ముంచెత్తుతున్నాయి. గురువారం సాయంత్రం నగరంలో కురిసిన భారీ వర్షాలకు నగరం వణికిపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. చెరువుల్ని తలిపించేలా పలు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. ఇక రోడ్లపై వరదనీరు నిలిచి

పోవడంతో ట్రాఫిక్ ఎక్కడిక్కడే స్తంభించింది పోయింది. డ్యూటీ ముగించుకుని, ఇండ్లకు వెళ్లేవారు గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోవాల్సి వచ్చింది. బుధవారం, గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీలలోని ఇండ్లలోకి వరద నీరు వచ్చింది. కుండపోత వర్షంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

సికింద్రాబాద్, బేగంపేట, ప్యారడైజ్, బోయినపల్లి, కూకట్పల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, పటాన్ చెరువు, ఖైరతాబాద్, అల్వల్, మాదాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

హైదరాబాద్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దీంతో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసి, హైడ్రా అధికారులు ప్రకటించారు. ప్రజలు జగ్రత్తగా ఉండాలని, ప్రత్యేకంగా మ్యాన్ హోల్స్, నాలాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒంటరికి బయటకు వెళ్లవద్దని “సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com