#Sharwa36 హైదరాబాద్‌లో కీలక రేసింగ్ సన్నివేశాలు షూటింగ్
- September 19, 2025
చార్మింగ్ స్టార్ శర్వా తన 36వ మూవీ #Sharwa36 లో స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్ గా కనిపించబోతున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వం లో ప్రతిష్టాత్మక UV క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వా, టీమ్‌పై రేస్ కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా వుండబోతున్నాయి.
ఈరోజు మేకర్స్ శర్వానంద్ పర్సనల్ స్టిల్స్‌ని విడుదల చేశారు. స్టైలీష్ మేకోవర్‌లో శర్వా లుక్స్ అదిరిపోయాయి. శర్వా ఫ్యాషన్ ట్రెండీ క్లాసీ లుక్ లో ఆకట్టుకున్నారు.
యూనిక్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకునే శర్వా, ఈ చిత్రంలో ఓ ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఆడ్రినలిన్ రష్‌ని ఇచ్చే స్టంట్స్ తో అదరగొట్టబోతున్నారు.
ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటించగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు.
వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ హై-ఎనర్జీ మూవీ మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది.
ఈ చిత్రానికి జె యువరాజ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూ, ఎక్సయిటింగ్ విజువల్స్ ని అందిస్తున్నారు. గిబ్రాన్ ఈ చిత్రానికి డైనమిక్ సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేస్తున్నారు. అనిల్ కుమార్ పి ఎడిటర్‌గా, ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్, ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అభిలాష్ కంకర
నిర్మాతలు: వంశీ-ప్రమోద్
సమర్పణ: విక్రమ్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: జిబ్రాన్
డీవోపీ: J యువరాజ్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
ఆర్ట్ డైరెక్టర్: ఎ పనీర్ సెల్వం
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..