ఎయిర్ ట్రాన్స్‌శాట్ పైలట్లు మద్యం మత్తులో..
- July 20, 2016
345 మంది ప్రయాణికులు.. తొమ్మిది మంది సిబ్బంది.. అందరూ ఎయిర్ ట్రాన్స్‌శాట్ విమానంలో ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. స్కాట్లాండ్‌లోని గ్లాస్‌గౌ విమానాశ్రయం నుంచి ఈ విమానం కెనడాకు వెళ్లాల్సి ఉంది. ఇంతలో పైలట్లు కూడా విమానం వద్దకు వచ్చారు. అయితే, వారు మద్యంలో మత్తులో తూలుతూ ఉండటంతో ముందుగానే పసిగట్టిన అధికారులు.. ఇద్దరు పైలట్లను అదుపులోకి తీసుకున్నారు. 345 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బందికి పెద్ద గండాన్ని తప్పించారు. ఈ ఘటన సోమవారం గ్లాస్ గౌ విమానాశ్రయంలో జరిగింది. తాగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కెప్టెన్ జీన్ ఫ్రాంకొయిస్ పెరియల్ట్ (39), జఫర్ సయ్యద్ (37) మంగళవారం కోర్టు ముందు హాజరుపరుచగా.. ఇద్దరికి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ ఊహించని ఘటనతో ప్రయాణికులు షాక్ తిన్నారు. సోమవారం వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా మంగళవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరింది. ఈ ఘటనపై ఎయిర్ ట్రాన్స్‌శాట్ విమానాయాన సంస్థ ప్రయాణికులను క్షమాపణ కోరింది. జరిగిన దానికి చింతిస్తూ ప్రయాణికులకు 200 కెనడియన్ డాలర్లు పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో రాజీపడబోమని పేర్కొంది. పైలట్లు ఇద్దరు కెనడాకు చెందిన వారని, వారిపై విచారణ జరుగుతున్నదని తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







