తె­లం­గా­ణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'

- September 21, 2025 , by Maagulf
తె­లం­గా­ణ: \'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు\'

హైదరాబాద్: తె­లం­గా­ణ­లో­ని మహి­ళ­ల­ను కో­టీ­శ్వ­రు­ల­ను చే­సే­లా కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం కా­ర్య­క్ర­మా­లు చే­ప­డు­తోం­ద­ని ఉప ము­ఖ్య­మం­త్రి భట్టి వి­క్ర­మా­ర్క అన్నా­రు. హై­ద­రా­బా­ద్‌­లో­ని యూ­సు­ఫ్‌­గూడ కో­ట్ల వి­జ­య­భా­స్క­ర్‌ రె­డ్డి స్టే­డి­యం­లో జరి­గిన ఇం­ది­రా మహి­ళా శక్తి కా­ర్య­క్ర­మం­లో భట్టి వి­క్ర­మా­ర్క పా­ల్గొ­న్నా­రు. గ్రే­ట­ర్‌­ప­రి­ధి­లో స్వ­యం సహా­యక సం­ఘా­ల­కు వడ్డీ లేని రు­ణా­ల­ను పం­పి­ణీ చే­శా­రు. అనం­త­రం భట్టి వి­క్ర­మా­ర్క మా­ట్లా­డు­తూ.. ఐదే­ళ్ల­లో కోటి మంది మహి­ళ­ల­ను కో­టీ­శ్వ­రు­ల­ను చే­య­డం తమ ప్ర­భు­త్వ లక్ష్య­మ­ని ప్ర­క­టిం­చా­రు. ‘‘మహి­ళల కోసం ఉచిత బస్సు సౌ­క­ర్యం కల్పిం­చాం. మహి­ళ­ల­ను ఇప్ప­టి­కే 150 ఆర్టీ­సీ బస్సు­ల­కు యజ­మా­ను­ల­ను చే­శాం. మరో 450 బస్సు­ల­కు యజ­మా­ను­ల­ను చే­య­బో­తు­న్నాం. మహి­ళ­లు ఇక వడ్డీ వ్యా­పా­రుల వద్ద­కు వె­ళ్లా­ల్సిన అవ­స­రం లేదు’’ అని భట్టి అన్నా­రు. కాంగ్రెస్ పాలన ప్రజా రంజకంగా సాగుతోందని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బం­దు­లు­న్నా 50 వేల మహి­ళా సం­ఘా­ల­కు తె­లం­గాణ సర్కా­ర్ వడ్డీ­లే­ని రు­ణా­లు ఇస్తుం­ద­ని కా­ర్మి­క­శాఖ మం­త్రి వి­వే­క్ వె­ల్ల­డిం­చా­రు. హై­ద­రా­బా­ద్ యూ­స­ఫ్‌­గూ­డ­లో­ని కో­ట్ల విజయ భా­స్క­ర్ రె­డ్డి స్టే­డి­యం­లో స్వ­యం సహా­యక సం­ఘాల మహి­ళ­ల­కు వడ్డీ లేని రు­ణాల చె­క్కు­లు పం­పి­ణీ చే­శా­రు. ఈ సం­ద­ర్భం­గా మా­ట్లా­డిన మం­త్రి వి­వే­క్ వెం­క­ట­స్వా­మి ..మహి­ళ­ల­ను ఆర్థి­కం­గా ని­ల­దొ­క్క­కు­నే­లా చే­య­డా­ని­కే ప్ర­భు­త్వం కృషి చే­స్తోం­ద­న్నా­రు. ప్ర­భు­త్వం ఆర్థిక ఇబ్బం­దు­ల్లో ఉన్నా 50 వేల మహి­ళా సం­ఘా­ల­కు మహి­ళా సం­ఘా­ల­కు ఇస్తు­న్నా­మ­ని చె­ప్పా­రు. మహి­ళ­ల­కు పె­ట్రో­ల్ బం­కు­లు ఇస్తు­న్నా­మ­న్నా­రు. మహి­ళా సం­క్షే­మా­ని­కి పె­ద్ద పీట వే­సిన పా­ర్టీ కాం­గ్రె­స్ పా­ర్టీ అని మం­త్రి సీ­త­క్క అన్నా­రు. గతం­లో కాం­గ్రె­స్ ప్ర­భు­త్వ ఆధ్వ­ర్యం­లో­నే పొ­దు­పు సం­ఘా­లు ఏర్పా­ట­య్యా­యి. రు­ణా­లు తీ­సు­కు­ని లక్షల మంది లబ్ది పొం­దు­తు­న్నా­రని సీతక్క వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com