శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- September 23, 2025
న్యూయార్క్: శాంతియుత పాలస్తీనా కోసం సౌదీ అరేబియా, ఫ్రాన్స్ చేతులు కలిపాయి. గాజా మరియు వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనా అధికారానికి మద్దతు ఇవ్వడానికి తమ మద్దతు కొనసాగుతుందని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశంలో మరోసారి స్పష్టం చేశాయి.
ఈ సందర్భంగా పాలస్తీనా అథారిటీ "ఒక రాష్ట్రం, ఒక ప్రభుత్వం, ఒక చట్టం మరియు ఒక ఆయుధం" విధానాన్ని రియాద్ , పారిస్ స్వాగతించాయి. గాజాలో హమాస్ నియంత్రణను ముగించడానికి తమ మద్దతు ఉంటుందన్నారు. అంతర్జాతీయ పర్యవేక్షణలో పాలస్తీనా అథారిటీకి ఆయుధాలను అందజేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రూపొందించిన "న్యూయార్క్ డిక్లరేషన్"కు UN జనరల్ అసెంబ్లీలో 142 సభ్య దేశాలలో అత్యధిక మెజారిటీతో ఆమోదించారు. మధ్యప్రాచ్యంలో శాంతి, స్థిరత్వానికి టూ స్టేట్స్ పరిష్కారం ఒక్కటే ఆమోదయోగ్యమైన మార్గమని సౌదీ, ఫ్రాన్స్ తేల్చిచెప్పాయి.
అదే సమయంలో గాజా నగరంపై ఇజ్రాయెల్ భూ దాడి తీవ్రతరం చేయడంతో గాజాలో పెరుగుతున్న మానవతా విషాదం పట్ల ఆందోలన వ్యక్తం చేశారు. స్వతంత్ర, ప్రజాస్వామ్య దేశంగా పాలస్తీనా కోసం ఇజ్రాయెల్ సాయపడాలని కోరారు.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్