OG మూవీ హైలైట్స్

- September 24, 2025 , by Maagulf
OG మూవీ హైలైట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ (OG) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చేసిన పవర్‌ఫుల్ రోల్ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఆయన లుక్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అభిమానులు మంత్ర ముగ్ధులయ్యారు. దర్శకుడు సుజీత్ పవన్ క్యారెక్టర్ డిజైన్‌ను అభిమానులను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దారు. దీంతో కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్‌లో సినిమాను చూడాలని ఆసక్తి చూపుతున్నారు.

యాక్షన్ పరంగా ఈ సినిమా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తొలిసారి కటానా ఉపయోగించి చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని రివ్యూలు చెబుతున్నాయి. ఆయనకు మార్షల్ ఆర్ట్స్‌పై ఉన్న నైపుణ్యం ఈ సినిమాలో మరింత స్పష్టంగా కనిపించింది. ఇక థమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు మరో స్థాయి హైప్ ఇచ్చాయి. “హంగ్రీ చీతా” నుండి “ఫైర్ స్ట్రోమ్” వరకు వచ్చిన పాటలు అభిమానులను ఉత్సాహపరిచాయి. ముఖ్యంగా పవన్ ఎలివేషన్ సీన్స్‌లో థమన్ ఇచ్చిన ఆర్ఆర్ సినిమా థియేటర్‌లలో పండగ వాతావరణాన్ని సృష్టించింది.

ఇక నటీనటుల ప్రదర్శనలో ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ వంటి వారి నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హిందీ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ విలన్ పాత్రలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. శ్రియా రెడ్డి నటన ‘సలార్’ తరవాత ‘ఓజీ’లో కూడా ఘనంగా ఆకట్టుకుంది. దర్శకుడు సుజీత్ ఫ్యాన్ బాయ్ డైరెక్షన్‌తో పవన్ కళ్యాణ్‌ను పూర్తిగా కొత్త యాక్షన్ షేడ్స్‌లో చూపించారు. కథలో కొత్తదనం లేకపోయినా, పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా మలచిన సన్నివేశాలు ఈ సినిమాను అభిమానులకు మరపురాని అనుభూతిగా మార్చాయి. అందువల్ల ఓజీ తప్పక థియేటర్‌లో చూడాల్సిన సినిమా అని చెప్పవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com