యాదగిరిగుట్ట కొండపైకి రోప్ వే

- September 25, 2025 , by Maagulf
యాదగిరిగుట్ట కొండపైకి రోప్ వే

హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొండపైకి వెళ్లే భక్తులకు మరింత మెరుగైన సదుపాయం కలగనుంది. పర్వతమాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా గుట్టపైకి వెళ్లేందుకు రోప్ వే ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో మరో మూడుచోట్ల రోప్ వేలను ఏర్పాటు చేయనున్నారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ-NHAI పరిధిలోని జాతీయ రహదారుల లాజిస్టిక్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ కు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 1.1 కిలోమీటర్లు, నల్గొండలోని హనుమాన్ కొండకు 1.2 కిలోమీటర్లు, నాగార్జునకొండ నుంచి నాగార్జునసాగర్ డ్యామ్ వరకు 1.7కిలోమీటర్లు, పెద్దపల్లి జిల్లా మంథనిలోని రామగిరికోటకు 2.4 కిలోమీటర్ల మేర రోప్ వే ఏర్పాటుకు సన్నాహాలు చేయనున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోసం NHAI బిడ్ లను ఆహ్వానించింది. అక్టోబర్ 21 వరకు బిడ్ ల సమర్పణకు అవకాశం కల్పించారు. కేంద్రం దేశవ్యాప్తంగా 200 రోప్ వేలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తాజాగా ఉత్తరాఖండ్ లో రెండు, తెలంగాణలో 4 రోప్ వేలకు పచ్చజెండా ఊపి ప్రక్రియ ప్రారంభించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com