అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు

- September 25, 2025 , by Maagulf
అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు


- వరల్డ్ హార్ట్ డే నేపథ్యంలో పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ప్రత్యేక కార్యక్రమాలు
- ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు వారం రోజుల పాటు స్పెషల్ కార్డియాలజీ ప్యాకేజ్
- ఈ నెల 28న అవనిగడ్డలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ అధినేత, ప్రఖ్యాత ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు
- ‘కార్పొరేట్ క్వాలిటీ.. ఆన్ అఫర్డబుల్ రియాలిటీ’ మూలసూత్రంతో ప్రజలకు ప్రపంచ శ్రేణి వైద్య సేవలందిస్తున్నాం
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ సీఈవో, ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకాశ్ పల్లెం

విజయవాడ: అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ వైద్య సేవలను అతి తక్కువ వ్యయంతో ప్రజలకు అందించడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ అధినేత, ప్రఖ్యాత ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు తెలియజేశారు. సూర్యారావుపేటలోని పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలతో, అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో తమ హాస్పిటల్ దాదాపు మూడు దశాబ్దాలుగా సేవలందిస్తోందని వెల్లడించారు. ‘కార్పొరేట్ క్వాలిటీ.. ఆన్ అఫర్డబుల్ రియాలిటీ’ అనే మూల సూత్రంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అత్యాధునిక వైద్య చికిత్సలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీ వరల్డ్ హార్ట్ డే నేపథ్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు ప్రకటించారు. ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు, వారం రోజుల పాటు స్పెషల్ కార్డియాలజీ ప్యాకేజ్ ను అందుబాటులో తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ ప్యాకేజ్ లో భాగంగా కేవలం రూ.600లకే ఈసీజీ, ఎకో, ఆర్బీఎస్, హిమోగ్లోబిన్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలతో పాటు, కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ సదుపాయం లభిస్తుందని వివరించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అందిస్తున్న ఈ స్పెషల్ హార్ట్ ప్యాకేజీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పెద్దేశ్వరరావు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులో తేవాలనే సంకల్పంతో ఈ నెల 28న కృష్ణాజిల్లా అవనిగడ్డలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. మాజీ మంత్రి దివంగత మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో నిర్వహించే ఈ మెగా వైద్య శిబిరం ద్వారా దివిసీమలోని వేలాది మందికి ఉచితంగా వైద్య సేవలందిస్తామని అన్నారు. కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, పల్మనాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఈఎన్టీ తదితర 20 విభాగాల వైద్య నిపుణులు ఈ శిబిరంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ మెగా వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య) తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు.

అనంతరం, పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ సీఈవో, ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకాశ్ పల్లెం మాట్లాడుతూ.. సామాన్య ప్రజలపై ఆర్ధిక భారం లేకుండా కార్పొరేట్ వైద్య సేవలను అందించడమే తమ హాస్పిటల్ ప్రధాన లక్ష్యమని అన్నారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ విభాగాలతో ఈ ప్రాంతంలో అతిపెద్ద అత్యవసర చికిత్సా కేంద్రంగా పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ సేవలందిస్తోందని డాక్టర్ ఆకాశ్ వెల్లడించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రవేశపెట్టిన స్పెషల్ హార్ట్ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ స్పెషల్ ప్యాకేజీకి సంబంధించిన బ్రోచర్లను హాస్పిటల్ వైద్యులతో కలిసి డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు, డాక్టర్ ఆకాశ్ పల్లెం ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డాక్టర్ సీహెచ్. ప్రసాద్ బాబు, డాక్టర్ సింధు చాగంటి, డాక్టర్ బి.పవన్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com