రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- September 25, 2025
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి.కొన్ని రోజులుగా వానలు కుమ్మేస్తున్నాయి. నాన్ స్టాప్ వానలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇక ముందు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చారు. భారీ వర్షాలున్నాయి, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నిరంతరం మానిటర్ చేయండి అంటూ అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలర్ట్ గా ఉండి పరిస్థితిని సమీక్షించాలని సీఎం రేవంత్ చెప్పారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అన్ని కాజ్ వేలను పరిశీలించాలన్నారు. రోడ్లపై వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించాలన్నారు.
విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వేలాడే వైర్లను తొలగించటంతో పాటు, ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు సీఎం రేవంత్. దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. వర్షం పడే సమయంలో అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని సూచించారు.
తాజా వార్తలు
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే
- అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు
- భారతదేశంలోనే తొలి ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్స్టిట్యూషన్’ సదస్సు
- భక్తుల సేవ కోసం సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్
- అక్టోబర్ 23 నుంచి ఖతార్ మ్యూజియమ్స్ వార్షికోత్సవ సీజన్..!!
- బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!
- విజిటర్స్ ఎంట్రీ పర్మిట్ కోసం పాస్పోర్ట్ కవర్ కాపీని సమర్పించాలా?
- భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు..!!