రాజా సాబ్ ట్రైలర్ వస్తోంది

- September 26, 2025 , by Maagulf
రాజా సాబ్ ట్రైలర్ వస్తోంది

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న రాజా సాబ్ మూవీపై భారీ అంచనాలున్నాయి. మారుతి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీతో ఫస్ట్ టైమ్ హారర్ జానర్ లోకి ఎంటర్ అవుతున్నాడు డార్లింగ్. ఇప్పటి వరకూ ఇండియాలోనే రానంత బిగ్ హారర్ కంటెంట్ ఇది అని మారుతి చెబుతున్నాడు. అతను తెలుగులో ఫస్ట్ టైమ్ చేసిన ప్రేమకథా చిత్రమ్ తో హారర్ కామెడీ అనే జానర్ నే క్రియేట్ చేశాడు. తర్వాత ఈ జానర్ లో దేశవ్యాప్తంగా ఎన్నో సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి. అలాంటి మారుతి రాజా సాబ్ గురించి అంత హైప్ ఇవ్వడం కూడా అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం బాగా ఆలస్యం అయింది. లేట్ అయినా ది బెస్ట్ క్వాలిటీతో వస్తాం అని చెబుతున్నారు నిర్మాతలు. రాజా సాబ్ ను డిసెంబర్ లో విడుదల చేస్తారు అనే ప్రచారం ఉంది. మరోవైపు సంక్రాంతికి వస్తుంది అని కూడా చెబుతున్నారు. దానికంటే ముందు ట్రైలర్ తో అభిమానులను హ్యాపీ చేయబోతున్నారు మేకర్స్. ఈ ట్రైలర్ ను రిషబ్ శెట్టి కాంతార సినిమాతో కలిపి విడుదల చేస్తాం అని ముందే ప్రకటించారు. సో.. అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదల కాబోతోన్న కాంతార చాప్టర్ 1తో పాటు రాజా సాబ్ ట్రైలర్ ను డైరెక్ట్ గా థియేటర్స్ లో ప్రదర్శిస్తారన్నమాట. ఇక ట్రైలర్ నిడివి కూడా పెద్దగానే ఉంటుందంటున్నారు. 3 నిమిషాలకు పైనే ట్రైలర్ నిడివి ఉంటుందని టాక్. మొత్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు దసరా పండగ జోష్ ఈ ట్రైలర్ తో డబుల్ కాబోతోందనే చెప్పాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com