హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- September 27, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టింది. శాంతి భద్రతల నిర్వహణ, పాలనలో వేగం పెంచడం, విభాగాల మధ్య సమన్వయం బలోపేతం చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఆరుగురు ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అధికారిక ప్రకటన రూపంలో వెల్లడించారు.
ఆర్టీసీ ఎండీగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వీసీ సజ్జనార్ (VC Sajjanar) బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎండీగా మరో ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి నియమితులయ్యారు. ఇక సజ్జనార్ నాలుగేళ్ల తర్వాత యూనిఫాం వేసుకోనున్నారు. తాజాగా బదిలీల్లో భాగంగా ఆయన్ను రేవంత్ సర్కార్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా కీలక పోస్టులోకి పంపింది.
ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ కార్యదర్శిగా నియమించారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్‌గా విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్‌కు బాధ్యతలు అప్పగించారు. గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్‌ను నియమించారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







