వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!

- September 27, 2025 , by Maagulf
వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!

కువైట్: న్యూఢిల్లీలో ప్రారంభమైన వరల్డ్ ఫుడ్ ఇండియా 2025లో 21 దేశాలు నుంచి  150 మంది అంతర్జాతీయ ప్రతినిధుల హాజరయ్యారు. ఇందులో  కువైట్ రాయబారి మిషాల్ ముస్తఫా అల్-షెమాలి పాల్గొని మాట్లాడారు. ఇది ప్రపంచ ఆహార మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ఒక ముఖ్యమైన వేదిక అని ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమం ఆర్థికాభివృద్ధికి మరియు ఆహార రంగంలో పెట్టుబడులకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉందని, ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆహార ఉత్పత్తిదారు, ఎగుమతిదారుగా ఇండియా ప్రముఖ పాత్రను పోషిస్తుందని ఆయన తెలిపారు. 

ఈ ప్రదర్శన స్థిరమైన ఆహార మార్కెట్లు, ఆహార ఉత్పత్తి మౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఆవిష్కరణలు మరియు ఉత్పాదకతను పెంచడానికి, ఈ రంగానికి అనుకూలమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి సారిస్తుందని అల్-షెమాలి హైలైట్ చేశారు.   

సెప్టెంబర్ 25 నుండి 28 వరకు జరిగే ఇండియన్ గ్లోబల్ ఫుడ్ ఎక్స్‌పో ఎడిషన్‌ ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా భారతదేశ స్థానాన్ని మోడీ మరింతగా హైలైట్ చేశారు.  ప్రపంచ ఉత్పత్తిలో 25% తోడ్పడు అందిస్తుందని, అదే సమయంలో బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు మరియు చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందన్నారు.  

గ్లోబల్ ఎక్స్‌పోలో ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, డెన్మార్క్, ఇటలీ, థాయిలాండ్, ఇండోనేషియా, తైవాన్, బెల్జియం, టాంజానియా, ఎరిట్రియా, సైప్రస్, ఆఫ్ఘనిస్తాన్, చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com