2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- September 27, 2025
దోహా: 2029 వాలీబాల్ పురుషుల ప్రపంచ ఛాంపియన్షిప్ నిర్వహణ హక్కులను ఖతార్ సాధించింది. ఈ సందర్భంగా ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ హర్షం వ్యక్తం చేశారు. "2029 FIVB పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఖతార్ బిడ్‌ను గెలుచుకున్నందుకు మేము గర్విస్తున్నాము. ఇది మధ్యప్రాచ్యంలో మొదటిసారి జరుగుతోంది." అని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన పోస్ట్‌లో వెల్లడించారు.
సెప్టెంబర్ 26న ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్ (FIVB) అడ్మినిస్ట్రేషన్ బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. FIVB వాలీబాల్ పురుషుల ప్రపంచ ఛాంపియన్షిప్ FIVB క్యాలెండర్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక పోటీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 32 జాతీయ జట్లు పాల్గొంటాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!