అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!

- September 27, 2025 , by Maagulf
అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!

యూఏఈ: ఐదు నెలల తర్వాత ఐకానిక్ దుబాయ్ ఫౌంటెన్ అక్టోబర్ 1 నుండి డౌన్‌టౌన్‌లో మళ్లీ ప్రారంభం కానుంది. రోజువారీ ప్రదర్శనలు అలరించనున్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం ప్రదర్శనలు ఉంటాయని ఎమ్మార్ తెలిపింది. మధ్యాహ్నం 1 గంటలకు ఒక షో, మరొకటి వారపు రోజులలో మధ్యాహ్నం 1.30 గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం 2 మరియు 2.30 గంటలకు ఉంటుందన్నారు. సాయంత్రం ప్రదర్శనలు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు 30 నిమిషాల వ్యవధిలో ఉంటాయని తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద డ్యాన్సింగ్ ఫౌంటెన్ వ్యవస్థ పునఃప్రారంభం కావడం పట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.          

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com