కేబుల్ రీల్స్ లో 3,037 ఆల్కహాల్ బాటిల్స్..!!
- September 28, 2025
యూఏఈ: కువైట్‌లోని షువైఖ్ పోర్టులో షిప్పింగ్ కంటైనర్‌లో కేబుల్ రీల్స్ లో దాచిపెట్టి, అక్రమంగా తరలిస్తున్న ఆల్కహాల్‌ను పెద్ద మొత్తంలో అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కస్టమ్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు సోషల్ మీడియా ప్రకటనలో తెలిపారు. ఓ యూరోపియన్ దేశం నుండి వచ్చిన 20 అడుగుల షిప్పింగ్ కంటైనర్‌లో దాచిపెట్టిన 3,037 ఆల్కహాల్ బాటిళ్లను అక్రమంగా రవాణా చేయడానికి జరిగిన ప్రయత్నాన్ని కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విజయవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించారు.
స్టీల్ కేబుల్ రీల్స్‌ను తీసుకువెళుతున్నట్లు ప్రకటించిన కంటైనర్‌లో లిక్కల్ బాటిళ్లను తరలించడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. కేబుల్ రీల్స్ ను కట్ చేసి లిక్కల్ బాటిల్స్ ను వెలికితీసే వీడియోను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ షేర్ చేసింది. ఇలా నిషేధిత పదార్థాలను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







