యూకే బయలుదేరిన కువైట్ అమీర్..!!

- September 28, 2025 , by Maagulf
యూకే బయలుదేరిన కువైట్ అమీర్..!!

న్యూయార్క్: కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా అమెరికా పర్యటన విజయవంతమైంది. ఆయనతోపాటు క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబా తో కూడిన ప్రతినిధి బృందం తదుపరి అధికారిక పర్యటన కోసం యూకే బయలుదేరి వెళ్లింది. అమీర్ UN జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌ లో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చారు. ఈ సందర్భంగా పలు దేశాల అధినేతలు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. అమెరికాలోని కువైట్ రాయబారి షేఖా అల్-జైన్ సబా అల్-నాజర్ అల్-సబా, UNలో కువైట్ శాశ్వత ప్రతినిధి రాయబారి తారిఖ్ మొహమ్మద్ అల్-బన్నై ఎయిర్ పోర్టులో అమీర్ కు వీడ్కోలు పలికారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com