అరబ్ లో అతి తక్కువ ప్రయాణ సమయం కలిగిన నగరాల్లో మస్కట్..!!
- September 28, 2025
మస్కట్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాసిటీలలో మస్కట్ అరుదైన ఘనతను నమోదు చేసింది. అతి తక్కువగా వాహనదారులు ట్రాఫిక్ లో గడుపుతున్న నగరంగా మస్కట్ నిలిచింది. మస్కట్ నివాసితులు సగటున 22.6 నిమిషాలు మాత్రమే ట్రాఫిక్ లో గడుపుతున్నారని నంబియో మిడ్-ఇయర్ 2025 ట్రాఫిక్ ఇండెక్స్ వెల్లడించింది. మస్కట్ అరబ్ ప్రపంచంలో అతి తక్కువ రద్దీ ఉన్న నగరంగా నిలిచింది. ఇక ట్రాఫిక్ రద్దీలో మస్కట్ ప్రపంచవ్యాప్తంగా 231వ స్థానంలో ఉంది. ట్రాఫిక్ ఇండెక్స్ స్కోరు 118.7గా ఉంది.
ఈ జాబితాలో దోహా 134.9, అబుదాబి 136.1, మనామా 140.4, జెడ్డా 140, కువైట్ 155.2, రియాద్ 158.2, దుబాయ్ 170 మరియు షార్జా 310.6 ట్రాఫిక్ ఇండెక్స్ స్కోరుతో నిలిచాయి. సగటు ప్రయాణ సమయం, వాహనదారుల ఫీడ్ బ్యాక్, ట్రాఫిక్ వ్యవస్థ సామర్థ్యం మరియు ఉద్గారాల ఆధారంగా నగరాలకు స్కోరును కేటాయిస్తుంది.
మస్కట్లో రోజువారీ ట్రాఫిక్ తలసరి 5,865.5 యూనిట్ల CO2 ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుందని నంబియో అంచనా వేసింది. ఇది 92.2 శాతం మంది ప్రయాణికులు ఉపయోగించే ప్రైవేట్ వాహనాలపై అధికంగా ఆధారపడటాన్ని హైలైట్ చేస్తుంది. ఇక కార్యాలయానికి లేదా పాఠశాలకు వెళ్లడానికి సగటు దూరం 23.39 కి.మీ.గా పేర్కొంది.దాదాపు 22.56 నిమిషాల ప్రయాణంతో చేరుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







