భారత రాయబార కార్యాలయం ఓపెన్ హౌస్ హైలెట్స్..!!
- September 28, 2025
మనామా: బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన ఓపెన్ హౌస్ విజయవంతమైంది. వినోద్ కురియన్ జాకబ్ అధ్యక్షతన జరిగిన ఓపెన్ హౌస్ సెషన్ లో పలువురు భారత ప్రవాసులు పాల్గొన్నారు. ఇంగ్లీష్, హిందీ మరియు మలయాళం భాషలలో నిర్వహించిన ఇంటరాక్టివ్ సమావేశంలో రాయబార కార్యాలయం కమ్యూనిటీ వెల్ఫేర్ , కాన్సులర్ విభాగాల బృందాలు, దాని ప్యానెల్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రవాసులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు.
ఇటీవలి రాయబార కార్యాలయం నేతృత్వంలోని చేపట్టిన కార్యక్రమాలను ఓపెన్ హౌజ్ వేదికగా రాయబారి జాకబ్ భారత కమ్యూనిటీకి వివరిస్తున్నారు. ఇందులో భాగంగా కౌన్సెలర్ చాన్సరీ అధిపతి రాజీవ్ కుమార్ మిశ్రా ఇతర అధికారులతో కలిసి ఇటీవల ఇసా టౌన్‌లోని జా జైలును సందర్శించారని తెలిపారు. అక్కడి మహిళా నిర్బంధ కేంద్రంలోని భారతీయ ఖైదీలతో మాట్లాడారని, వారి సంక్షేమానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు.
సెప్టెంబర్ 15న కాన్సులర్ హాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టూరిజానికి సంబంధించి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP) విజయవంతమైన ప్రారంభోత్సవాన్ని ఆయన హైలైట్ చేశారు. ఈ రెండు భారతీయ రాష్ట్రాలు గొప్ప సంప్రదాయాలను ప్రదర్శిస్తూ.. ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలతో పర్యాటకంలో పురోగతి సాధిస్తున్నాయని ప్రశంసించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







